Team India : ఉనాద్కట్ ఆడినట్లు కూడా ఆడలేకపోయిన టీమిండియా స్టార్ ప్లేయర్లు..ముఖ్యంగా ఆ ఇద్దరు దారుణంగా విఫలం
Team India : ఉనాద్కట్ ఆడినట్లు కూడా ఆడలేకపోయిన టీమిండియా స్టార్ ప్లేయర్లు..ముఖ్యంగా ఆ ఇద్దరు దారుణంగా విఫలం
Team India : 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 45 పరుగులతో నాలుగో రోజు ఆటను కొనసాగించింది. తొలుత మూడు వికెట్లు కోల్పోయినా రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ వీరోచిత పోరాటంతో భారత్ నెగ్గింది.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ (India) సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్ లో భారత్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
2/ 8
145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 45 పరుగులతో నాలుగో రోజు ఆటను కొనసాగించింది. తొలుత మూడు వికెట్లు కోల్పోయినా రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ వీరోచిత పోరాటంతో భారత్ నెగ్గింది.
3/ 8
ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దారుణంగా విఫలం అయ్యారు. జట్టుకు అవసరం అయిన చోట వీరిద్దరూ చేతులెత్తేశారు. వీరితో పాటు పుజారా, శుబ్ మన్ గిల్ లు కూడా విఫలం అయ్యారు.
4/ 8
అయితే ఎంతో అనుభవం ఉన్న రాహుల్, కోహ్లీ విఫలం అవ్వడంపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా వీరిద్దరూ రెండో ఇన్నింగ్స్ లో ఆడిన తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.
5/ 8
కనీసం ఉనాద్కట్ లా కూడా ఆడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ 2 పరుగులు చేస్తే.. కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ టెస్టు సిరీస్ లో దారుణంగా విఫలం అయ్యాడు.
6/ 8
ఇక కీలక సమయంలో కోహ్లీ అతి జాగ్రత్తకు వెళ్లి వికెట్ ను పారేసుకున్నాడు. 23 బంతులు ఆడిన అతడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు.
7/ 8
తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులతో రాణించిన పంత్ కూడా రెండో ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు. అయితే అశ్విన్ (42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) అజేయమైన 8వ వికెట్ కు 71 పరుగులు జోడించి టీమిండియాను గెలిపించారు.
8/ 8
అక్షర్ పటేల్ 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్ ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.