బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ చాలా అందంగా ఉంటుంది. ఆమె అందంగా కారణంగా షిషిర్ కు తరచూ మోడలింగ్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆమె వాటిని అంగీకరించదు. శిశిర్ మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. ఆమె కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పొందింది. ఉమ్మె అహ్మద్ శిశిర్ అమెరికాలో పెరిగారు. దీంతో.. ఆమె లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. షిషిర్ చాలా బోల్డ్ మరియు ఓపెన్ మైండెడ్. (PC : Instagram)
తమీమ్ ఇక్బాల్ మరియు అయేషా సిద్ధిఖీ 8 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. టీనేజీ వయసులోనే ఇద్దరి ప్రేమ మొదలైంది. అయేషాకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు.. తమీమ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అయితే మొదట ఆయేషా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆయేషా దూరమైనప్పుడు వీరి ప్రేమకథ మొదలైంది. ఆయేషా తన చదువుల కోసం మలేషియా వెళ్లగా.. తమీమ్ బంగ్లాదేశ్ తరఫున ఆడడం ప్రారంభించాడు. కానీ, వీరి దూరం ఆ తర్వాత దగ్గర చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు అందమైన పిల్లలు ఉన్నారు. (PC : Instagram)
లిటన్ దాస్ భార్య దేబశ్రీ సంచిత భారతీయ టెలివిజన్ నటి మరియు మోడల్. దీంతో పాటు రైతు కూడా. సంచిత సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఈ ఛానెల్ ద్వారా కొన్ని మేకప్ చిట్కాలు మరియు వంట ట్యుటోరియల్‌లను నేర్పుతుంది. ఓ గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో దేబశ్రీ గాయపడింది. అయితే.. ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. (PC : Instagram)
ముష్ఫికర్ రహీమ్, అతని భార్య జన్నతుల్ కిఫాయత్ ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. వీరి ప్రేమకథ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. తొలి చూపులోనే ఒకరినొకరు ఇద్దరు ఇష్టపడ్డారు. అయితే, ఆ విషయం చెప్పుకోవడానికి చాలా టైంనే తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరు 2014లో పెళ్లి చేసుకున్నారు. జన్నతుల్ చదువులో బ్రిలియెంట్. పెళ్లయ్యాక బిజినెస్ చేస్తుంది. (PC : Instagram)
నజ్ముల్ హొస్సేన్ బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. సబ్బీర్ రెహ్మాన్ తర్వాత దేశవాళీ టీ20ల్లో సెంచరీ సాధించిన రెండో బంగ్లాదేశీయుడు అతను. కోవిడ్-19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో సబ్రీన్ సుల్తానా రత్నను వివాహం చేసుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన నజ్ముల్.. 4 సంవత్సరాల డేటింగ్ తర్వాత 2020.. జూలై 11న తన స్నేహితురాలిని వివాహం చేసుకున్నాడు. (PC : Instagram)
అఫీఫ్ హుస్సేన్ 2021లో వివాహం చేసుకున్నారు. అఫీఫ్ హుస్సేన్ భార్య చాలా అందంగా ఉంటుంది. అయితే, అతని భార్య పేరు లేదా ఆమె గురించి ఇతర సమాచారం లేదు. అఫీఫ్ తరచుగా తన భార్యతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటాడు. బంగ్లాదేశ్‌లోని అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో అఫీఫ్ హొస్సేన్ ఒకరు. 2016లో అండర్-19 ఆసియా కప్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు. (PC : Instagram)
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ రబేయా అక్తర్ ప్రీతిని పెళ్లాడాడు. ఈ జంట ఒకరితో ఒకరు 6 సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఈ జంట 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఖుల్నాలోని వధువు ఇంటి ఖలీష్పూర్లో వివాహ వేడుక జరిగింది. వివాహ సమయంలో మిరాజ్ భార్య ఖుల్నాలోని బిఎల్ కాలేజీలో హయ్యర్ సెకండరీ స్కూల్ (హెచ్ఎస్సి) విద్యార్థిని. అతని మామ బెలాల్ హుస్సేన్ వ్యాపారవేత్త.(PC : Instagram)
ప్రఖ్యాత బంగ్లాదేశ్ క్రీడా శిక్షా ప్రతిస్థాన్ (BKSP) నుంచి వెలుగులోకి వచ్చిన అనముల్ హక్ 2012 నుంచి బంగ్లాదేశ్ తరపున ఆడుతున్నాడు. అనముల్ హక్ దాదాపు 10 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఫరియా ఎరాను వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుక జూన్ 2018లో జరిగింది. ఒక సంవత్సరం తరువాత వారు రిసెప్షన్ నిర్వహించారు. 2020 కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ దంపతులకు ఒక ఆడ బిడ్డ జన్మించింది. (PC : Instagram)