గాయం కారణంగా రోహిత్ శర్మ (Rohit Sharma).. బంగ్లాదేశ్ (Bangladesh) తో జరిగే వన్డే సిరీస్కు దూరమయ్యాడు. డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్లో కూడా రోహిత్ దిగడంపై అనుమానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డాడు. బొటనవేలు గాయం తర్వాత కూడా రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, టీమిండియాకు పరాజయం తప్పలేదు. (AP)
దీంతో, మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 0-2తో వెనుకబడి ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ డిసెంబర్ 10న (నేడు) జరగనుంది. రోహిత్ చివరి మ్యాచ్ ఆడడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ కి ఇది ఒక అగ్నీ పరీక్ష. జట్టును క్లీన్ స్వీప్ నుంచి కాపాడే బాధ్యత అతనిపై ఉంటుంది. రాహుల్ టెస్టు సిరీస్కు కూడా కెప్టెన్గా వ్యవహరించవచ్చు. (AP)
2022 టీమిండియాకు కలిసిరాలేదు. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆసియా కప్ లో కూడా ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పై ఓటమి. ఇక, బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ కాకుండా చివరి వన్డే గెలవాల్సి ఉంది. ఒకవేళ చివరి వన్డేలో ఓడిపోతే టీమిండియా పరువు గంగ పాలు అయినట్టే. (AP)