IND vs BAN : మూడో రోజు హీరో.. నాలుగో రోజు జీరో.. టీమిండియాను గెలిచేలా చేసిన బంగ్లాదేశ్ ప్లేయర్!
IND vs BAN : మూడో రోజు హీరో.. నాలుగో రోజు జీరో.. టీమిండియాను గెలిచేలా చేసిన బంగ్లాదేశ్ ప్లేయర్!
IND vs BAN : అయితే భారత్ గెలుపునకు రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ లు ఏ విధంగా అయితే కారణం అయ్యారో.. అదే విధంగా ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ కూడా కారణం అయ్యాడు.
రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ (India) 3 వికెట్ల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటలో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
2/ 8
ఒక దశలో భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా కనిపించింది. మెదీ హసన్ వేసే స్పిన్ బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానామే లేకపోయింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాటాన్ని చూపించాడు.
3/ 8
అయితే భారత్ గెలుపునకు రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ లు ఏ విధంగా అయితే కారణం అయ్యారో.. అదే విధంగా ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ కూడా కారణం అయ్యాడు.
4/ 8
మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ క్యాచ్ ను షార్ట్ లెగ్ లో మోహినుల్ అద్భుత డైవ్ తో పట్టిన సంగతి తెలిసిందే. కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ నేలకూలడంలో మోహినుల్ హక్ ప్రధాన పాత్ర పోషించి మూడో రోజు ఆటలలో బంగ్లాదేశ్ కు హీరోగా మారాడు.
5/ 8
అదే మోమినుల్ హక్ నాలుగో రోజు మాత్రం జీరోగా మిగిలాడు. బ్యాటింగ్ కు దిగిన ఆరంభంలో రవిచంద్రన్ అశ్విన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను మోమినుల్ హక్ మిస్ చేశాడు.
6/ 8
అచ్చం కోహ్లీ లానే అశ్విన్ కూడా షార్ట్ లెగ్ లో మోమినుల్ హక్ కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీతో పోలిస్తే అశ్విన్ ఇచ్చిన క్యాచ్ చాలాసులభమైనది. నేరుగా మోమినుల్ చేతుల్లోకే వెళ్లింది. అయితే బంతి దిశను అర్థం చేసుకోవడంలో పోరపాటు పడ్డ మోమినుల్ క్యాచ్ ను జారవిడిచాడు.
7/ 8
ఇక్కడ బతికిపోయిన అశ్విన్ ఆ తర్వాత సూపర్ బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. మొదట శ్రేయస్ అయ్యర్ షకీబుల్ హసన్ ను బాదితే.. మెదీ హసన్ బౌలింగ్ ను అశ్విన్ చీల్చి చెండాడు.
8/ 8
మెదీ హసన్ వేసిన బౌలింగ్ లో 6, 2, 4, 4 కొట్టిన అశ్విన్ భారత్ కు విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యచ్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలవడం విశేషం. ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.