మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు నష్టపోయి 45 పరుగులు చేసింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ (54 బంతుల్లో 26 బ్యాటింగ్; 3 ఫోర్లు), నైట్ వాచ్ మన్ బ్యాటర్ జైదేవ్ ఉనాద్కట్ (8 బంతుల్లో 3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే మిగిలి ఉన్న రెండో రోజుల్లో మరో 100 పరుగులు చేయాల్సి ఉంది.