ఆఖరి నిమిషంలో పంత్ బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడికి రీప్లేస్ మెంట్ గా అయినా సామ్సన్ ను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే బీసీసీఐ మాత్రం అలా చేయలేదు. రాహుల్ ను వికెట్ కీపర్ గా తొలి వన్డేలో బరిలోకి దింపింది. కీలక సమయంలో రాహుల్ క్యాచ్ డ్రాప్ చేసి మ్యాచ్ ను చేజారేలా చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే బీసీసీఐ రాజకీయాలు సామ్సన్ కెరీర్ ను నాశనం చేసేలా కనిపిస్తున్నాయి.