Rohit Sharma : డేంజర్ లో రోహిత్ శర్మ.. గేర్ మార్చకుంటే ఈ ముగ్గురిలో ఒకరు భర్తీ చేసే అవకాశం
Rohit Sharma : డేంజర్ లో రోహిత్ శర్మ.. గేర్ మార్చకుంటే ఈ ముగ్గురిలో ఒకరు భర్తీ చేసే అవకాశం
Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ను రికార్డు స్థాయిలో 5 సార్లు చాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ శర్మది. దాంతో అతడి నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ ను గెలుస్తుందని అంతా అనుకున్నారు.
సరిగ్గా ఏడాది క్రితం టీమిండియా (Team India)లో కెప్టెన్సీ మార్పు జరిగింది. తొలుత టి20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ (Virat Kohli)ని భర్తీ చేసిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత వన్డే, టెస్టుల్లో కూడా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.
2/ 8
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ను రికార్డు స్థాయిలో 5 సార్లు చాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ శర్మది. దాంతో అతడి నాయకత్వంలో టీమిండియా ప్రపంచకప్ ను గెలుస్తుందని అంతా అనుకున్నారు.
3/ 8
ఆరంభంలో రోహిత్ కెప్టెన్ గా అదరగొట్టాడు. ప్లేయర్ గా పరుగులు చేయడంలో విఫలం అయినా.. కెప్టెన్ గా మాత్రం భారత్ కు వరుస విజయాలను అందించాడు. దాంతో రోహిత్ ఫామ్ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు.
4/ 8
అయితే ఆసియా కప్ నుంచి అంతా తారుమారు అయ్యింది. ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన భారత్ కనీసం ఫైనల్ కూడా చేరకుండానే ఇంటి దారి పట్టింది. ఇక టి20 ప్రపంచకప్ లో కూడా భారత్ చేతులెత్తేసింది. సూపర్ 12లో అదరగొట్టినా ఆ తర్వాత సెమీస్ లో చేతులెత్తేసి ఇంటిదారి పట్టింది.
5/ 8
ఇక వ్యక్తిగతంగా రోహిత్ కూడా ఫామ్ లో లేడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగిన తొలి వన్డేలో కూడా భారత్ అవమానకర రీతిలో ఓడింది. గెలిచే మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసింది. దాంతో రోహిత్ డేంజర్ లో పడ్డాడు.
6/ 8
అటు ఓపెనర్ గా ఇటు కెప్టెన్ గా రోహిత్ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక అదే సమయంలో శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సంజూ సామ్సన్ లాంటి వాళ్లు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు.
7/ 8
రోహిత్ శర్మ గేర్ మార్చి ఫామ్ లోకి రాకపోతే టీమిండియాలో అతడి ప్లేస్ డేంజర్ లో పడే అవకాశం ఉంది. 2023లో వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. నవంబర్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇదే ఫామ్ తో రోహిత్ అప్పటి వరకు నెట్టుకు రావడం కష్టమే.
8/ 8
ప్రస్తుతం ఉన్న ఫామ్ నే రోహిత్ కొనసాగిస్తే తొందర్లోనే అతడిని తప్పించి.. ఓపెనర్ గా గిల్ లేదా ఇషాన్ లను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే శిఖర్ ధావన్, పంత్ ల స్థానాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాయి.