టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్లో ఓవర్ రేటును అంగీకరించాడు. అంతేకాకుండా మ్యాచ్ రిఫరీకి క్షమాపణలు కూడా తెలియజేశాడు. 'ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ నిబంధన ప్రకారం స్లో ఓవర్ రేటు చేసిన జట్టు ప్లేయర్లకు, సపోర్టింగ్ స్టాఫ్‌కి, అలాగే జట్టుతో సంబంధం ఉన్న ఇతర సిబ్బందికి ఒక్కో ఓవర్‌కి 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించడం జరుగుతుంది.' అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.