తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. తొలి వన్డే హీరో మెదీ హసన్ మిరాజ్ (83 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. మహ్ముదుల్లా (96 బంతుల్లో 77; 7 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో మెరిశాడు. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు చెరో 2 వికెట్లు తీశారు.
ప్రస్తుతం రోహిత్ ఉన్న పరిస్థితుల్లో రెండో వన్డేలో బ్యాటింగ్ కు దిగే అవకాశం లేదు. దాంతో శిఖర్ ధావన్ తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు. అయితే 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. కాసేపటికే ధావన్ (8) కూడా అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ 8 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు.