Team India : ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ముగ్గురు టీమిండియా స్టార్ ప్లేయర్స్.. వారెవరంటే?
Team India : ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ముగ్గురు టీమిండియా స్టార్ ప్లేయర్స్.. వారెవరంటే?
Team India : డిసెంబర్ 6న ముగ్గురు భారత స్టార్ ప్లేయర్లు పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. వీరితో పాటు మరో ముగ్గురు కూడా బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారెవరో తెలుసుకోవాలంటే చదవండి.
టీమిండియా (Team India)లోని ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఒకే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్నారు. ఒకే రోజు ఇలా ముగ్గురు ప్లేయర్లు పుట్టిన రోజు జరుపుకోవడం నిజంగా విచిత్రమే.
2/ 8
రవీంద్ర జడేజా, జస్ ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ లు డిసెంబర్ 6న జన్మించారు. ఈ ముగ్గురు ప్లేయర్లు కూడా ప్రస్తుత టీమిండియా జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్నారు.
3/ 8
జడేజా, బుమ్రాలు గాయాలతో బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ మాత్రమే ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ ను ఆడుతున్నాడు.
4/ 8
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా డిసెంబర్ 6, 1988న నవగామ్ లో జన్మించాడు. 2008లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో భారత్ చాంపియన్ గా నిలిచిన జట్టులో జడేజా సభ్యుడు. ఆ టీంకు కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు.
5/ 8
స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా డిసెంబర్ 6నే జన్మించాడు. అయితే 1993లో అహ్మదాబాద్ లో జన్మించాడు. మొదట ఐపీఎల్ లో అదరొట్టిన అతడు ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ భారత్ కు కీలక ప్లేయర్ గా మారాడు.
6/ 8
శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 6, 1994న ముంబైలో జన్మించాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వచ్చే ప్రపంచకప్ లో ఆడటమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ దూసుకెళ్తున్నాడు.
7/ 8
ఈ ముగ్గురితో పాటు టీమిండియా మాజీ పేసర్ రుద్రప్రతాప్ సింగ్ కూడా డిసెంబర్ 6నే జన్మించాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో అతడు జన్మించాడు. 2007 టి20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికాతో జరిగిన కీలక పోరులో అద్భుత ప్రదర్శన చేశాడు.
8/ 8
టీమిండియా ప్లేయర్ కరుణ్ నాయర్, ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లు కూడా డిసెంబర్ 6నే జన్మించారు. భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కరుణ్ నాయర్ ఉండటం విశేషం.