అత్యధిక మొత్తంలో ఆర్జించడం దగ్గరి నుంచి గోల్స్.. హ్యాట్రిక్స్ ఇలా ప్రతి విషయంలోనూ రొనాల్డో రికార్డులు నెలకొల్పాడు. యూరో కప్ 2020 సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన ముందున్న రెండు కోకా కోలా కంపెనీ బాటిల్స్ ను పక్కన పెట్టి.. ఆరోగ్యంగా ఉండేందుకు వాటర్ తాగండి అని చెబితేనే ఆ కంపెనీ వేల కోట్లలో నష్టాన్ని చవిచూసింది. ఇదొక్కటి చాలు ప్రపంచాన్ని రొనాల్డో ఎలా షేక్ చేస్తున్నాడో తెలియడానికి.
ఇక స్విట్జర్లాండ్ తో జరిగిన ప్రిక్వార్ట్స్ మ్యాచ్ కోసం ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్ లో తొలుత రొనాల్డో చోటు దక్కించుకోలేదు. ఆరంభంలో అతడు బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన రామోస్ ఏకంగా 3 గోల్స్ తేడాతో పోర్చుగల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి 15 నిమిషాల్లో రొనాల్డో సబ్ స్టిట్యూట్ హోదాలో బరిలోకి దిగాడు.
పోర్చుగల్ ఫుట్ బాల్ ముఖ చిత్రాన్ని మార్చిన ఘనుడు రొనాల్డో. అయితే ప్రస్తుతం అతడు ఫామ్ లో లేడు. స్టార్ ప్లేయర్ అనే ఉద్దేశంతో రొనాల్డోకు ఛాన్స్ ఇస్తే అది జట్టు విజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కోచ్ ఫెర్నాండో సాంటోస్ జట్టు ముఖ్యం అని భావించి స్టార్ ప్లేయర్ అని కూడా చూడకుండా రొనాల్డోను బెంచ్ కే పరిమితం చేశాడు.
రోహిత్ మరికొన్ని రోజులు ఇలానే ఆడినట్లు అయితే రొనాల్డో మాదిరి బెంచ్ కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ట్యాలెంట్ ఉన్న గిల్, సంజూ సామ్సన్, రజత్ పటిదార్ లాంటి ప్లేయర్లు ఛాన్స్ ల కోసం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. బీసీసీఐ, కోచ్ లు కూడా టీమిండియా ప్రయోజనాలకే పెద్ద పీఠ వేయాల్సి ఉంది. అప్పుడే టీమిండియా మరో ప్రపంచకప్ ను ముద్దాడుతుంది.