IND vs BAN 2nd ODI : టీమిండియా సకల దరిద్రాలకు కారణం ఇదే.. ఎప్పుడు మారుతుందో ఏంటో?
IND vs BAN 2nd ODI : టీమిండియా సకల దరిద్రాలకు కారణం ఇదే.. ఎప్పుడు మారుతుందో ఏంటో?
IND vs BAN 2nd ODI : మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోని భారత్ ఈ ఏడాది ఆరంభంలో వరుసగా సిరీస్ లను నెగ్గింది. మధ్యలో రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంతలు కూడా భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించారు.
2022 సంవత్సరాన్ని టీమిండియా (Team India) అద్భుతంగా ఆరంభించింది. 2021 టి20 ప్రపంచకప్ (T20 Wprld Cup)లో సూపర్ 12 దశ నుంచే ఇంటి దారి పట్టిన తర్వాత భారత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
2/ 8
మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు తీసుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీలోని భారత్ ఈ ఏడాది ఆరంభంలో వరుసగా సిరీస్ లను నెగ్గింది. మధ్యలో రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంతలు కూడా భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించారు.
3/ 8
ఈ ఏడాది ఆసియా కప్ ముందు వరకు కూడా భారత్ విజయాలతోనే సాగింది. అయితే ఆసియాకప్ లో భారత్ అనూహ్యంగా చతికిలపడింది. ఆ తర్వాత టి20 ప్రపంచకప్ లోనూ అదే పరిస్థితి. సూపర్ 12లో అదరగొట్టి.. సెమీస్ లో చేతులెత్తేసింది.
4/ 8
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. బుమ్రా, షమీలు గాయాల బారిన పడితే.. సిరాజ్, శార్దుల్, ఉమ్రాన్ నిలకడలేని ప్రదర్శన చేస్తున్నారు. అర్ష్ దీప్ సింగ్ మాత్రమే భారత జట్టులో ఫర్వాలేదనిపిస్తున్నాడు.
5/ 8
తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ భారత బౌలింగ్ పేలవంగా ఉంది. తన కంటే బలహీనంగా ఉన్న జట్టుపై కూడా మన పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.
6/ 8
ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో భారత్ తేలిపోతుంది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ ను 136 పరుగులకే 9 వికెట్లు తీసి కట్టడి చేసింది. చివర్లో ఒక్క వికెట్ తీయలేక భారత బౌలర్లు విఫలం అయ్యారు. కేఎల్ రాహుల్ సులభమైన క్యాచ్ ను డ్రాప్ చేశాడు కూడా.
7/ 8
ఇక రెండో వన్డేలోనూ భారత బౌలర్లు ఆఖర్లో మరోసారి చేతులెత్తేశారు. తొలుత అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లాదేశ్ 69 పరుగులకే 4 వకెట్లు కోల్పోయింది. అయితే మహ్ముదుల్లా (77), మెదీ హసన్ మిరాజ్ (100 నాటౌట్) భారత బౌలర్లను చితక్కొట్టారు.
8/ 8
ఆసియా కప్ లో నిరాశ పరిచినా.. టి20 ప్రపంచకప్ లో చేతులెత్తేసినా.. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్ లో విఫలం అవుతున్నా అందుకు ముఖ్య కారణం బౌలింగే. భారత బౌలింగ్ మెరుగుపడకపోతే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లోనూ భారత్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.