Team India : టీమిండియాలో ప్రక్షాళనకు నడుం బిగించిన బీసీసీఐ.. వారిద్దరితోనే మొదలు!
Team India : టీమిండియాలో ప్రక్షాళనకు నడుం బిగించిన బీసీసీఐ.. వారిద్దరితోనే మొదలు!
Team India : టి20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ క్రమంలో తొలుత సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ఇక ప్రస్తుతం జట్టులో పలువురిని సాగనంపేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.
గత కొంత కాలంగా టీమిండియా (Team India) పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ముఖ్యంగా ఆసియా కప్ (Asia Cup) 2022 నుంచి పూర్తిగా గాడి తప్పింది. ఆసియా కప్ లో మొదలైన టీమిండియా పతనం బంగ్లాదేశ్ (Bangladesh) తో వన్డే సిరీస్ వరకు కొనసాగుతూనే ఉంది.
2/ 9
15 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతామంటూ టి20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత్.. మరోసారి సెమీఫైనల్లో ఓడి ఇంటి దారి పట్టింది. ద్వైపాక్షిక సిరీస్ ల్లో, గ్రూప్ దశలో అదరగొట్టడం కీలక మ్యాచ్ ల్లో చేతులెత్తేసి ఇంటి దారి పట్టడం టీమిండియాకు అలవాటుగా మారిపోయింది.
3/ 9
టి20 ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ క్రమంలో తొలుత సెలెక్షన్ కమిటీపై వేటు వేసింది. ఇక ప్రస్తుతం జట్టులో పలువురిని సాగనంపేందుకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.
4/ 9
జట్టు ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ.. గత కొంత కాలంగా ఫామ్ లో లేని ప్లేయర్లను జట్టు నుంచి సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. ఈ జాబితాలో ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్లు టాప్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
5/ 9
రిషభ్ పంత్, శిఖర్ ధావన్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతానికి రిషభ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక శిఖర్ ధావన్ మాత్రం వన్డేల్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
6/ 9
న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే లో 72 పరుగులు చేసిన ధావన్ ఫామ్ లో ఉన్నట్లే కనిపించాడు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. వరుసగా 4 మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యాడు.
7/ 9
ఇక అదే సమయంలో బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో మెరిపించాడు. ఈ క్రమంలో ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్ ను రెగ్యులర్ ఓపెనర్ గా చేసేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తుంది.
8/ 9
ఇక పంత్ కూడా వరుసగా విఫలం అవుతున్నాడు. ఎప్పుడో ఆరు నెలల క్రితం ఇంగ్లండ్ పై సెంచరీ బాదాడన్న ఒకే ఒక్క కారణంతో పంత్ కు ఇప్పటికీ అవకాశాలు లభిస్తున్నాయి. అయితే పంత్ ఆట మారడం లేదు. దాంతో పంత్ ను తప్పించి అతడి స్థానంలో సంజూ సామ్సన్ లాంటి ప్లేయర్ కు అవకాశం ఇవ్వాలనే తలంపుతో ఉన్నట్లు తెలుస్తుంది.
9/ 9
ఈ క్రమంలోనే టెస్టుల నుంచి పంత్ ను వైస్ కెప్టెన్ గా తప్పించింది. బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో పంత్ విఫలం అయితే అతడిపై వేటు ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ల ప్రక్షాళన పంత్, ధావన్ ల నుంచే మొదలయ్యే అవకాశం ఉంది.