‘డియర్ ఆల్... క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అయితే తప్పడం లేదు. నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అందుకే రంజీ ట్రోఫీ సీజన్లో చాలా మ్యాచులకు దూరంగా ఉండబోతున్నా. అయితే నేను త్వరలోనే కోలుకుని, జట్టులోకి తిరిగి వస్తాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు. ఏ సమస్యలతో ఖలీల్ ఆసుపత్రిపాలయ్యాడనే విషయం తెలియరాలేదు. (PC : TWITTER)
2018లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్.. టీమిండియా తరుపున 11 వన్డేలు, 14 టీ20 మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అయతే ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం.. ఫిట్ నెస్ సమస్యలతో ఎంత త్వరగా టీమిండియాలోకి వచ్చాడో అంతే త్వరగా జట్టులో చోటో కోల్పోయాడు. (PC : TWITTER)
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఖలీల్ అహ్మద్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. చివరకు ఢిల్లీ జట్టు రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఖలీల్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 10 మ్యాచ్ లు ఆడిన అతడు 16 వికెట్లతో సత్తా చాటాడు. (PC : TWITTER)