IND vs BAN : డబుల్ సెంచరీతో జాక్ పాట్ కొట్టేసిన ఇషాన్ కిషన్! అసలు కథ ఇదే
IND vs BAN : డబుల్ సెంచరీతో జాక్ పాట్ కొట్టేసిన ఇషాన్ కిషన్! అసలు కథ ఇదే
IND vs BAN : గత కొంత కాలంగా ఇషాన్ కిషన్ వన్డే, టి20ల్లో నిలడగా ఆడుతున్నాడు. సీనియర్లు లేనప్పుడు అవకాశం దక్కినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రెగ్యులర్ టీమిండియాలోకి తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన మూడో వన్డేలో చివరి నిమిషంలో చోటు దక్కించుకున్న యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానానికే ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు.
2/ 8
గత కొంత కాలంగా ఇషాన్ కిషన్ వన్డే, టి20ల్లో నిలడగా ఆడుతున్నాడు. సీనియర్లు లేనప్పుడు అవకాశం దక్కినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రెగ్యులర్ టీమిండియాలోకి తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
3/ 8
టి20 ప్రపంచకప్ ముందు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా కిషన్ రాణించాడు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీతో మెరిశాడు.
4/ 8
డబుల్ సెంచరీ చేసిన ఆనందంలో ఉన్న ఇషాన్ కిషన్ కు జాక్ పాట్ దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాదికి సంబంధించి త్వరలో బీసీసీఐ ప్రకటించే వార్షిక కాంట్రాక్టు జాబితాలో ఇషాన్ కిషన్ కు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
5/ 8
సి లేదా బి కాంట్రాక్టు జాబితాలో ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాదికి గానూ ‘సి’ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ కు ప్రమోషన్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
6/ 8
ఇక టీమిండియాకు దూరమైన అజింక్యా రహానే, ఇషాన్ కిషన్ లకు వచ్చే ఏడాది బీసీసీఐ ప్రకటించే వార్షిక కాంట్రాక్టులో చోటు దక్కేది అనుమానంగానే ఉంది. అదే జరిగితే వీరిద్దరి క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే లెక్క.
7/ 8
2022 సంవత్సరానికి గానూ బీసీసీఐ మొత్తం 27 మందికి కాంట్రాక్టు ఇచ్చింది. గ్రూప్ ను బట్టి ఒక్కో ప్లేయర్ రూ కోటి నుంచి ఏడు కోట్ల వరకు బీసీసీఐ నుంచి జీతంగా అందుకుంటారు.
8/ 8
‘ఎ ప్లస్’లో ఉన్న కోహ్లీ, బుమ్రా, రోహిత్ లు ప్రస్తుతం బీసీసీఐ నుంచి ఏడాదికి రూ. 7 కోట్లను అందుకుంటున్నారు. ‘ఎ’లో ఉన్న వారు రూ. 5 కోట్లను అందుకుంటున్నారు. ‘బి’లో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’లో ఉన్న వారు రూ. కోటి రూపాయలను అందుకుంటున్నారు.