తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (70 బంతుల్లో 73; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే ఫర్వలేదనిపించాడు. ప్రపంచకప్ తర్వాత టీమిండియాలోకి కమ్ బ్యాక్ చేసిన రోహిత్ శర్మ (27), కోహ్లీ (9) నిరాశ పరిచారు. శిఖర్ ధావన్ (7) మరోసారి విఫలం అయ్యాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 5 వికెట్లతో చెలరేగిపోయాడు. ఎబాదత్ 4 వికెట్లతో రాణించాడు.