గతేడాది ఆసియా కప్ ముందు వరకు కోహ్లీ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ అనంతరం రెండు నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలో కోహ్లీ ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకున్నాడు. బృందావన్‌కు కూడా వెళ్లాడు. అక్కడ ఒక బాబా ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. అంతకుముందే నీమ్ కరోలీ బాబా ఆశ్రమంలో కూడా సేద తీరాడు. (PC : TWITTER)
ఈ క్రమంలోనే కోహ్లీ రిషికేష్ లోని స్వామి దయానంద్ ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ అభిమానులతో సెల్ఫీ కూడా దిగాడు. టి20, వన్డేల్లో రాణించిన కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆసీస్ పై కోహ్లీ ఎలా ఆడతాడో అని అతడి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. (PC : TWITTER)