గాయం నుంచి కోలుకున్న రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ తో మళ్లీ కమ్ బ్యాక్ చేయనున్నాడు. ఈ సిరీస్ లో జడేజా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్షర్ పటేల్ రూపంలో జడేజాకు ప్రత్యామ్నాయం టీమిండియాకు సిద్ధంగా ఉంది. జడేజా ఆసీస్ తో జరిగే సిరీస్ లో విఫలం అయితే మాత్రం ఇక అంతే సంగతులు.
ఇక వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ అద్బుతంగా రాణిస్తున్న వేళ.. అశ్విన్ ను టీంలో ఎక్కువ కాలం కొనసాగించకపోవచ్చు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ బంతితో కంటే కూడా బ్యాట్ తో రాణించాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ తో జరిగే సిరీస్ లో అశ్విన్ వికెట్లు తీయాల్సి ఉంది.