గతేడాది జరిగిన ఐపీఎల్ నుంచి కూడా కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తనకు అవకాశం దక్కిన ప్రతిసారి అదరగొట్టాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన అతడు.. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 3 వికెట్లతో మెరిశాడు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.