IND vs AUS : రెండో టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన ఆసీస్.. జడేజా లాంటి ప్లేయర్ ను రప్పిస్తోంది
IND vs AUS : రెండో టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన ఆసీస్.. జడేజా లాంటి ప్లేయర్ ను రప్పిస్తోంది
IND vs AUS : తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్లేయర్లు, మాజీలు వాగిన మాటలు అన్నీ ఇన్ని కావు. ప్రాక్టీస్ మ్యాచ్ తో తమకు ఏమీ ఒరగదని.. దాని బదులు స్పిన్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేయడమే మేలంటూ స్టీవ్ స్మిత్ పేర్కొన సంగతి తెలిసిందే.
నాగ్ పూర్ (Nagpur)లో టీమిండియా (Team India) ఇచ్చిన సర్ ప్రైజ్ కు ఆస్ట్రేలియా (Australia) ప్లేయర్ల ఫ్యూజులు ఎగిరిపోయే ఉంటాయి. ఈసారి బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మాదే అన్న ఆసీస్ మాజీలు సైతం తొలి టెస్టు తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. (PC : cricket.com.au)
2/ 8
తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్లేయర్లు, మాజీలు వాగిన మాటలు అన్నీ ఇన్ని కావు. ప్రాక్టీస్ మ్యాచ్ తో తమకు ఏమీ ఒరగదని.. దాని బదులు స్పిన్ ట్రాక్ పై ప్రాక్టీస్ చేయడమే మేలంటూ స్టీవ్ స్మిత్ పేర్కొన సంగతి తెలిసిందే.
3/ 8
బెంగళూరు వేదికగా ప్రత్యేకంగా తయారు చేసిన వికెట్ పై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఇక రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ను పోలిన మహేశ్ ను నెట్ బౌలర్ గా తీసుకుని అతడితో ప్రాక్టీస్ చేసింది.
4/ 8
అయితే తొలి టెస్టులో ఇవేమి ఆస్ట్రేలియాను గట్టెక్కించలేదు. ప్రాక్టీస్ కు నిజమైన ఆటకు చాలా తేడా ఉంటుందని భారత్ ప్రూవ్ చేసింది. జడేజా, అశ్విన్ ల బౌలింగ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ శతకం తోడవ్వడంతో నాగ్ పూర్ లో ఆసీస్ కు ఘోర పరాభవం ఎదురైంది.
5/ 8
తొలి ఓటమిని వీలైనంత వేగంగా మరిచి పోయి రెండో టెస్టుకోసం ఆలోచించాలనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా ఉంది. అంతేకాకుండా ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది.
6/ 8
అచ్చం రవీంద్ర జడేజాలాగా బౌలింగ్ చేసే మాథ్యూ కనెమన్ ను టెస్టు సిరీస్ కోసం పిలిచింది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా జట్టుతో చేరే అవకాశం ఉంది. అంతేకాదు రెండో టెస్టులో తుది జట్టులో ఆడించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. (PC : TWITTER)
7/ 8
మ్యాథ్యూ కూడా జడేజాలాగా ఎడం చేతి వాటం స్పిన్నర్. జడేజా బౌలింగ్ యాక్షన్ కు మ్యాథ్యూ శైలికి డిఫెరెన్స్ ఉన్నా లెఫ్టార్మ్ స్పిన్నర్ కాబట్టి అతడికి జట్టులో చోటు కల్పించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. (PC : TWITTER)
8/ 8
మ్యాథ్యూ ఇప్పటి వరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 35 వికెట్లు తీశాడు. బిగ్ బాష్ బ్రిస్బేన్ హీట్ తరఫున ఈ సీజన్ లో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 26.50 సగటుతో 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. (PC : TWITTER)