Virat kohli : ‘విరాట్ ఒకే.. రోహిత్ కు అంత సీన్ లేదు’ షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా వెటరన్
Virat kohli : ‘విరాట్ ఒకే.. రోహిత్ కు అంత సీన్ లేదు’ షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా వెటరన్
Virat kohli : ప్రస్తుతం వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరి ఫోకస్ మొత్తం 50 ఓవర్ల ఫార్మాట్ పైనే ఉంది.
విరాట్ కోహ్లీ (Virat Kohli).. రోహిత్ శర్మ (Rohit sharma).. టీమిండియా (Team India)కు రెండు కళ్ల లాంటి వాళ్లు. ప్రస్తుతం టీమిండియాలో వీరిద్దరూ ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లు. ఇక ఒంటి చేత్తో తమ జట్లను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు.
2/ 8
ప్రస్తుతం వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో వీరిద్దరి ఫోకస్ మొత్తం 50 ఓవర్ల ఫార్మాట్ పైనే ఉంది.
3/ 8
అంతకంటే ముందు జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియాను ఫైనల్స్ చేర్చడంపై వీరిద్దరూ దృష్టి సారించారు. అందుకోసం తీవ్రంగా చెమటోడుస్తున్నారు. అయితే ఒక విషయంపై వీరిద్దరి గురించి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
4/ 8
ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టి20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నారు. వీరి గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా పొట్టి ఫార్మాట్ లో అదరగొడుతుంది. వరుసగా మూడు సిరీస్ లను నెగ్గింది.
5/ 8
ఇక శుబ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్ లాంటి యువ ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలో 2024లో జరిగే టి20 ప్రపంచకప్ లో కోహ్లీ, రోహిత్ శర్మ ఆడే అంశంపై జాఫర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
6/ 8
35 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే తన ఆఖరి ప్రపంచకప్ ను ఆడేశాడని జాఫర్ పేర్కొన్నాడు. 2024 టి20 ప్రపంచకప్ లో రోహిత్ ఆడేందుకు అవకాశం లేదని తేల్చేశాడు. అయితే కోహ్లీకి మాత్రం 2024 టి20 ప్రపంచకప్ లో ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
7/ 8
రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. 33 ఏళ్ల వయసులోనూ వికెట్ల మధ్య చురుకుగా పరుగెత్తుతాడు. అంతేకాకుండా ఫల్డ్ లో ఏ స్థానంలో అయినా ఫీల్డింగ్ చేయగలడు.
8/ 8
ప్రస్తుతం రోహిత్ శర్మ ఉన్న ఫిట్ నెస్, ఫామ్ ను దృష్టిలో ఉంచుకొని జాఫర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే 2024 నాటికి చాలా టైమ్ ఉంది. ఫామ్ లో ఉంటే రోహిత్ శర్మ, కోహ్లీలు తప్పకుండా టి20 ప్రపంచకప్ లో ఉండే అవకాశం ఉంది.