బరోడా ప్లేయర్ మహేశ్ పితియా బౌలింగ్ శైలి అచ్చం రవిచంద్రన్ అశ్విన్ లానే ఉంటుంది. అశ్విన్ యాక్షన్ లానే మహేశ్ కూడా బౌలింగ్ చేస్తాడు. దాంతో అతడిని అశ్విన్ డూప్ గా దేశవాళి క్రికెట్ లో పిలుస్తారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు ఈ పర్యటన కోసం మహేశ్ పితియాను నెట్ బౌలర్ గా సెలెక్ట్ చేసుకుంది. (PC : TWITTER)