అలా అని షార్ట్ పిచ్ బాల్ కు సూర్యకుమార్ దగ్గర ఇదొక్క షాటే ఉందనుకుంటే పొరపాటే. అదే షార్ట్ పిచ్ బాల్ ను కీపర్ నెత్తి మీద నుంచి కూడా ఆడగలడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో కూడా స్వీప్ షాట్ ఆడటం సూర్యకు మాత్రమే చెల్లింది. దాంతో మిస్టర్ 360 అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు.