Team India : జనవరిలో దంచి కొట్టాడు.. ప్రతిష్టాత్మక అవార్డు పట్టేశాడు.. ఫ్యూచర్ ఈ టీమిండియా ప్లేయర్ దే
Team India : జనవరిలో దంచి కొట్టాడు.. ప్రతిష్టాత్మక అవార్డు పట్టేశాడు.. ఫ్యూచర్ ఈ టీమిండియా ప్లేయర్ దే
Team India : జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై మూడో వన్డేల్లో సెంచరీ బాదిన గిల్.. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయాడు.
2023లో టీమిండియా (Team India) స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం.
2/ 7
జనవరిలో శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంకపై మూడో వన్డేల్లో సెంచరీ బాదిన గిల్.. కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో రెచ్చిపోయాడు.
3/ 7
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో డబుల్ బాదాడు. ఇక మూడో వన్డేలో కూడా సెంచరీతో మెరిశాడు. అనంతరం కివీస్ తో జరిగిన చివరిదైన మూడో టి20లో కూడా సెంచరీతో మెరిశాడు.
4/ 7
ఈ ఏడాది గిల్ హవా నడుస్తుందని చెప్పాలి. తాజాగా అతడిని ప్రతిష్టాత్మక ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు కూడా వరించింది. జనవరి నెలకు గానూ గిల్ ఈ అవార్డును అందుకున్నాడు.
5/ 7
సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ కు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో చోటు మాత్రం దక్కలేదు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకుంది. అయితే రాహుల్ తొలి టెస్టులో విఫలం అయ్యాడు.
6/ 7
దాంతో ఈ నెల 17 నుంచి ఆరంభమయ్యే రెండో టెస్టులో రాహుల్ స్థానంలో గిల్ ఆడే అవకాశం ఉంది. తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా దూకుడు మీద ఉంది. రెండో టెస్టులో కూడా నెగ్గి సిరీస్ లో ఆధిక్యంలో నిలవాలని ఉంది.
7/ 7
ఇక తొలి టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఉంది. అయితే అది అంత సులభం కాదు. ఇక రెండో టెస్టు కోసం మ్యాథ్యూ కనెమన్ ను ఆఖరి నిమిషంలో జట్టులోకి తీసుకుంది. (PC : TWITTER)