Shubman Gill : శుబ్ మన్ గిల్, సారా అలీ ఖాన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Shubman Gill : శుబ్ మన్ గిల్, సారా అలీ ఖాన్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Shubman Gill-Sara Ali Khan : శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఒక శతకం.. ఒక అర్ధ సెంచరీ బాదిన గిల్.. న్యూజిలాండ్ పై విశ్వరూపం ప్రదర్శించాడు. వన్డే సిరీస్ లో ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండటం విశేషం.
శుబ్ మన్ గిల్ (Shubman Gill).. టీమిండియా (Team India) నయా సంచలనం ఇప్పుడు. క్రితం ఏడాది వరకు సైలెంట్ గా ఉన్న ఈ యంగ్ ఓపెనర్ ప్రస్తుతం డైనమైట్ లా పేలుతున్నాడు. ఇక ఈ ఏడాది అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
2/ 8
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఒక శతకం.. ఒక అర్ధ సెంచరీ బాదిన గిల్.. న్యూజిలాండ్ పై విశ్వరూపం ప్రదర్శించాడు. వన్డే సిరీస్ లో ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండటం విశేషం.
3/ 8
ఇక అనంతరం జరిగిన టి20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో పెద్దగా ఆడని గిల్.. మూడో టి20లో మాత్రం రెచ్చిపోయాడు. 63 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.
4/ 8
మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకునే గిల్.. బయట మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/ 8
సారా అలీ ఖాన్ మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కూతురు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. గిల్ తో డేటింగ్ చేస్తూ మరోసారి ఈ అమ్మడు వార్తల్లోకి ఎక్కింది. (PC : TWITTER)
6/ 8
వీరిద్దరికి సంబంధించిన మరో న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్. సారా అలీ ఖాన్ గిల్ కంటే వయసులో పెద్ద. అది కూడా ఏకంగా నాలుగేళ్లు పెద్ద. (PC : TWITTER)
7/ 8
ప్రస్తుతం సారా అలీ ఖాన్ వయసు 27 ఏళ్లు కాగా.. శుబ్ మన్ గిల్ వయసు 23 ఏళ్లు మాత్రమే. తన కంటే నాలుగేళ్లు చిన్న అయిన గిల్ తో సారా అలీ ఖాన్ రొమాన్స్ చేస్తుంది. (PC : TWITTER)
8/ 8
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కంటే వయసులో 6 ఏళ్లు పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే గిల్ కూడా సచిన్ అడుగు జాడల్లో నడుస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియాలంటే మరికొన్నేళ్లు ఆగాల్సిందే.