మిడిల్ ఓవర్స్ ను వసీం జూనియర్ వేసినట్లే.. టీమిండియాలో ఆ బాధ్యతను హార్దిక్ పాండ్యాతో చేయిస్తుందని అర్థం పర్థం లేని కామెంట్స్ చేశాడు. అయితే పాకిస్తాన్ స్పిన్ కంటే కూడా భారత స్పిన్ అటాక్ బలంగా ఉందని పేర్కొనడం విశేషం. రవూఫ్, షాహీన్ అఫ్రిది, వసీం జూనియర్ లు మాత్రమే పాకిస్తాన్ లో ఉన్నారు. అదే భారత్ కు వచ్చే సరికి సిరాజ్, షమీ, బుమ్రా, శార్దుల్ ఠాకూర్, శివమ్ మావి లాంటి పేసర్లు ఉన్నారనే విషయాన్ని రమీజ్ రాజా గుర్తించుకోవాలి.