బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. అతను బ్యాక్ ఆఫ్ హ్యాండ్ డెలివరీ, స్లో కట్టర్లను వేస్తూ బ్యాటర్లను తికమక పెట్టడంలో దిట్ట. అతని విలక్షణమైన శైలి అతడిని పాపులర్ చేయడంతో పాటు ఐపీఎల్ లో అవకాశాలను కూడా ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ముస్తాఫిజుర్ పెళ్లి చేసుకున్నాడు. అతడు తన మేనమామ కుమార్తె సమియా పర్వీన్ని వివాహం చేసుకున్నాడు . సమియా పర్వీన్ ఢాకా యూనివర్సిటీలో సైకాలజీ విద్యార్థిని. ఈ విషయాన్ని క్రికెట్ అడ్డా పేర్కొంది. (PC : TWITTER)
ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఏప్రిల్ 22, 2004లో దూరపు కజిన్ ఆర్తి అహ్లావత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె సెహ్వాగ్ కు మరదలి వరుస అవుతుంది. వీరిది ప్రేమ వివాహం. మొదట్లో వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అయితే సెహ్వాగ్ తన ప్రేమను వదిలిపెట్టలేదు. కష్టపడి ఇరు కుటుంబాలను ఒప్పించి తన ప్రేమను సక్సెస్ చేసుకున్నాడు. ఆటలోనే కాదు ప్రేమలోనూ సెహ్వాగ్ హీరోగా మారాడు. సెహ్వాగ్, ఆర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. (PC : TWITTER)