అయితే ఓటమికి ఆసీస్ మీడియా సాకులను వెతకడం మొదలు పెట్టింది. జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడని.. స్పిన్ పిచ్ లంటూ నానా హంగామా చేసింది. ఆసీస్ మీడియాకు భారత్ ఫ్యాన్స్, మీడియా కూడా గట్టిగానే బదులిచ్చింది. ఆస్ట్రేలియాలో ఆడేప్పుడు టీమిండియా బౌన్సీ వికెట్ పై ఆడాల్సి వస్తుందని.. అయితే బౌన్సీ ట్రాక్ లంటూ టీమిండియా ఎప్పుడూ ఏడ్వలేదని తన రిప్లైలో పేర్కొంది.
ఇండియాలో స్పిన్ ట్రాక్ లు ఎదురవుతాయని తెలిసి కూడా తొలి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో ఆడటం ఏంది. ఆ ఇద్దరు కూడా ఒకే రకమైన స్పిన్నర్లు. భిన్నమైన స్పిన్నర్లను తీసుకోవాలన్న కనీస అవగాహన కూడా లేదు. ఇక ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ ను పక్కన బెట్టి.. రెన్ షాకు ఛాన్స్ ఇవ్వడం. ముందు ఆసీస్ మీడియా తమ దేశ జట్టు కూర్పుపై ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి ఉంది.