Sanju Samson : సంజూ సామ్సన్ అభిమానులకు అదరిపోయే న్యూస్.. అందులో పాస్ అయిన మిస్టర్ కూల్
Sanju Samson : సంజూ సామ్సన్ అభిమానులకు అదరిపోయే న్యూస్.. అందులో పాస్ అయిన మిస్టర్ కూల్
Sanju Samson : ఇక తాజాగా సంజూ సామ్సన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయినట్లు సమాచారం. దాంతో మార్చి నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ సెలెక్షన్ కు సంజూ సామ్సన్ అందుబాటులో ఉండనున్నాడు.
ఈ ఏడాది శ్రీలంక (Sri Lanka)తో జరిగిన తొలి టి20లో ఫీల్డింగ్ చేస్తూ సంజూ సామ్సన్ (Sanju Samson) గాయపడ్డ సంగతి తెలిసిందే. థర్డ్ మ్యాన్ దిశలో బంతి బౌండరీకి చేరకుండా ఆపే క్రమంలో సంజూ డైవ్ చేయగా.. అతడి మోకాలికి గాయమైంది.
2/ 7
అనంతరం అతడికి స్కానింగ్ చేయగా.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో సంజూ సామ్సన్ న్యూజిలాండ్ తో వన్డే, టి20 సిరీస్ లకు దూరమయ్యాడు.
3/ 7
ఇక తాజాగా సంజూ సామ్సన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయినట్లు సమాచారం. దాంతో మార్చి నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ సెలెక్షన్ కు సంజూ సామ్సన్ అందుబాటులో ఉండనున్నాడు.
4/ 7
ఇక అదే సమయంలో వెన్ను గాయంతో గత ఏడాది నుంచి ఆటకు దూరంగా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా కూడా ఫిట్ నెస్ పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే అతడు ఫిట్ నెస్ టెస్టును పాస్ అవ్వలేదని సమాచారం.
5/ 7
జస్ ప్రీత్ బుమ్రా 100 శాతం ఫిట్ నెస్ సాధించేందుకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఒకరకంగా టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బుమ్రా లాంటి బౌలర్ ఎక్కువ రోజులు జట్టుకు దూరంగా ఉంటే అది మంచిది కాదు.
6/ 7
ప్రస్తుతం న్యూజిలాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న భారత్.. అనంతరం ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ను ఆడనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా రెండు జట్లు 4 టెస్టులను ఆడనుంది.
7/ 7
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే ఈ టెస్టు సిరీస్ లో భారత్ తప్పక నెగ్గాల్సి ఉంది. చూస్తుంటే బుమ్రా ఈ టెస్టు సిరీస్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఆసీస్ తో వన్డే సిరీస్ నాటికి ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది.