Team India : మరో టీమిండియా ప్లేయర్ కు సర్జరీ.. న్యూజిలాండ్ లో ఆపరేషన్! ఎవరికంటే?
Team India : మరో టీమిండియా ప్లేయర్ కు సర్జరీ.. న్యూజిలాండ్ లో ఆపరేషన్! ఎవరికంటే?
Team India : గతేడాది ఆరంభంలో విండీస్ తో టి20 మ్యాచ్ సందర్భంగా దీపక్ చహర్ గాయం బారిన పడ్డాడు. అనంతరం అతడు NCAలో చికిత్స పొందుతూ మరోసారి గాయపడ్డాడు. దాంతో గతేడాది జరిగిన ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.
టీమిండియా (Team India)ను గాయాల సమస్య వెంటాడుతోంది. గత ఏడాది కాలంగా కీలక ప్లేయర్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. కొందరు కోలుకుని తిరిగి టీమిండియాకు ఆడుతుంటే మరికొందరేమో సర్జరీలు చేయించుకుంటున్నారు.
2/ 8
గతేడాది ఆరంభంలో విండీస్ తో టి20 మ్యాచ్ సందర్భంగా దీపక్ చహర్ గాయం బారిన పడ్డాడు. అనంతరం అతడు NCAలో చికిత్స పొందుతూ మరోసారి గాయపడ్డాడు. దాంతో గతేడాది జరిగిన ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఆసియా కప్ ముందు టీమిండియాలోకి పునరాగమనం చేసినా ఆ వెంటనే మరోసారి గాయపడ్డాడు.
3/ 8
ఇక ఆసియా కప్ సందర్భంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలికి గాయం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అతడు ఆసియా కప్ మధ్యలోనే వైదొలిగాడు. అనంతరం శస్త్ర చికిత్స చేయించుకోవడంతో టి20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు.
4/ 8
ఇక తాజాగా జస్ ప్రీత్ బుమ్రా కూడా జడేజా దారిలోనే నడుస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ అనంతరం వెన్ను గాయంతో క్రికెట్ కు దూరమయ్యాడు. అనంతరం ఫిట్ గా లేకపోయినా టి20 ప్రపంచకప్ ముందు కమ్ బ్యాక్ చేసి మరోసారి గాయపడ్డాడు.
5/ 8
అనంతరం టి20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు. అతడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. తాజాగా అతడి వెన్ను గాయానికి శస్త్ర చికిత్స అవసరం అని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది.
6/ 8
దాంతో బీసీసీఐ జస్ ప్రీత్ బుమ్రాకు సర్జరీ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమచారం. న్యూజిలాండ్ లో ఈ సర్జరీ జరిగే అవకాశం ఉందని స్పోర్ట్స్ వెబ్ సైట్ ఇన్ సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది.
7/ 8
ఇప్పటికే బుమ్రా కివీస్ కు చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. డాక్టర్ రొవన్ స్కాటెన్ పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్, కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ లకు కూడా రొవన్ సర్జరీ చేశాడు.
8/ 8
ఈ సర్జరీ అనంతరం బుమ్రా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ నాటికి బుమ్రా పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అది టీమిండియాకు గుడ్ న్యూస్.