ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను వరల్డ్ రికార్డు ఊరిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 423 సిక్స్‌లు బాదిన రోహిత్.. ఓవరాల్‌గా మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 99 సిక్స్‌లు బాదిన హిట్ మ్యాన్.. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు.
మరోవైపు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో జట్టుకు దూరమవ్వడంతో పేస్ భారమంతా బుమ్రాపైనే పడింది. యువపేసర్లు సిరాజ్, సైనీకి మార్గనిర్దేశకం చేస్తూ అతడు వికెట్ల వేటను కొనసాగించాలి. మరోవైపు తొలి మ్యాచ్ ఆడుతున్న సైనీ, హైదరాబాద్ పేసర్ సిరాజ్ అద్భుత ప్రదర్శన చేసి సీనియర్ ఆటగాళ్లు లేని లోటును తీర్చాలి. అయితే అశ్విన్ సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.