* డిసైడర్ మ్యాచ్ : రెండు జట్లకు మూడో వన్డే కీలకం కానుంది. ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్లో భారత్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. ఒకవేళ ఆసీస్ గెలిస్తే 2-1 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకోవడంతో పాటు వన్డే జట్టు ర్యాంకింగ్స్లో ప్రస్తుతం 112 పాయింట్ల నుంచి 113 పాయింట్లకు ఎగబాకుతుంది.
అదే సమయంలో భారత్ వన్డే ర్యాకింగ్ 114 పాయింట్ల నుంచి 113 పాయింట్లకు పడిపోతుంది. అయితే భారత్ ఇప్పటికే 2022-23 లో 46 మ్యాచ్లు ఆడగా, ఆసీస్ 34 మ్యాచ్లు మాత్రమే ఆడింది. దీంతో మూడో వన్డేలో ఆసీస్ గెలిస్తే వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది.ఒకవేళ భారత్ గెలిస్తే 115 పాయింట్లకు చేరి అగ్రస్థానంలో కొనసాగుతుంది. చివరి వన్డేలో గెలిచి మళ్లీ వన్డేల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతుండగా, భారత్ తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
* ప్రస్తుత వన్డే జట్ల ర్యాంకింగ్స్ : భారత్ ప్రస్తుతం 114 పాయింట్లతో ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 112 పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 111 పాయింట్లతో మూడో ప్లేస్లో ఉన్నాయి. ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వరుసగా 4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. ఇక బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ వరుసగా 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.