‘సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 3 బంతులను మాత్రమే ఆడాడు. ఈ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనను ఎలా విశ్లేషించాలో అర్థం కావడం లేదు. అతడు మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. అవి కూడా అద్భుతమైనవి. ఈ సిరీస్ గురించి అతడు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. స్పిన్నర్లను సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతాడు. గత రెండు మూడేళ్లుగా అతడు అద్భుత ఫామ్ లో ఉన్నాడు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
‘అతడు బాగా ఆడుతున్నాడు కాబట్టే.. చివరి 15-20 ఓవర్లలో సూర్యకుమార్ మా ప్రధాన ఆయుధంగా భావిస్తున్నాం. మ్యాచ్ ను ఫినిష్ చేయంలో సూర్యకుమార్ యాదవ్ దిట్ట. ఒక్క సిరీస్ తో అతడి బ్యాటింగ్ ను తక్కువ చేసి చూడలేము. ప్రతి ప్లేయర్ కూడా పేలవ ప్రదర్శన చేస్తాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అతడి బ్యాటింగ్ లో కానీ, నైపుణ్యంలో కానీ లోపాలు లేవు. తొందర్లోనే అతడు మునుపటి ఫామ్ ను అందుకుంటాడు’ అని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు.