Ind vs Aus 2020: వారెవ్వా కోహ్లీ.. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రికార్డుల మోత

Ind vs Aus : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడిలైడ్ టెస్ట్ లో రికార్డుల మోత మోగించాడు. అటు ప్లేయర్ గా, ఇటు కెప్టెన్ గా అరుదైన ఘనతల్ని సాధించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న రన్ మెషీన్ అడిలైడ్ టెస్ట్ లో 74 పరుగులతో సత్తా చాటాడు. ఇంతకీ కోహ్లీ సాధించిన రికార్డులేంటంటే..