* వన్డేల్లో 13వేల పరుగులు : వన్డేలో మునుపటి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ, పరుగుల విషయంలో మరో రికార్డుకు చేరువయ్యాడు. ఇంటర్నేషనల్ వన్డేల్లో 13,000 పరుగుల మైలురాయి చేరుకోవడానికి ఈ స్టార్ బ్యాటర్ 191 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ కేవలం 262 ఇన్నింగ్స్‌ల్లోనే వన్డేల్లో 12,809 పరుగులు చేశాడు. 13వేల పరుగులు సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా, ఐదో ఆటగాడిగా నిలవడానికి విరాట్ రెడీ అవుతున్నాడు.
* ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు : విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో 75 సెంచరీలు కొట్టాడు. వీటిలో 16 ఆస్ట్రేలియాపై నమోదు చేశాడు. వన్డేల్లో కింగ్ కోహ్లీ కంగారూలపై ఎనిమిది సెంచరీలు సాధించాడు. తాజా సిరీస్‌లో మరో సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ (9) రికార్డును కోహ్లీ సమం చేస్తాడు. ఈ సిరీస్‌లో విరాట్ రెండు సెంచరీలు బాదితే, సచిన్‌ను అధిగమించవచ్చు.
రేపటి నుంచి జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ కనీసం మరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంటే.. ఆస్ట్రేలియాపై ఎక్కువ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఆసీస్‌పై 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సచిన్ టెండూల్కర్ ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సర్ వివ్ రిచర్డ్స్, ఇయాన్ బోథమ్ ఇద్దరూ తమ కెరీర్లో ఆస్ట్రేలియాపై 10 అవార్డులు అందుకున్నారు.