* సూర్యకుమార్ యాదవ్ : పొట్టి ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగే మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో ఇప్పటి వరకు అంతగా రాణించలేదు. వన్డేల్లో అతని సగటు ప్రస్తుతం 28.86గా ఉంది. ఈ గణాంకాలు బట్టి చూస్తే వన్డేల్లో SKY మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. టీ-20లతో పోల్చితే వన్డే ఫార్మాట్ చాలా భిన్నంగా ఉంటుంది.
ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫి చివరి టెస్ట్‌లో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం అయింది. దీంతో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతని స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఇది సూర్యకుమార్ యాదవ్‌కు మంచి అవకాశంలాంటిది. ఈ వన్డే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసే ప్రదర్శన బట్టి, వన్డే ప్రపంచ్‌కప్ జట్టులో అతడి స్థానం ఆధారపడి ఉంటుంది.