అనంతరం వన్డే కెప్టెన్ గా కూడా ప్యాట్ కమిన్స్ ను నియమించింది. అయితే కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. భారత్ తో ముగిసిన టెస్టు సిరీస్ తొలి రెండు మ్యాచ్ ల్లోనూ కెప్టెన్ గా పూర్తిగా విఫలం అయ్యాడు. అనంతరం తల్లి అనారోగ్యంతో ఉండటంతో కమిన్స్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అదే సమయంలో జట్టు బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తల రాతను మార్చేశాడు.