ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా భారత జట్టు డే/నైట్ టెస్టుకు సిద్ధమవుతోంది. రేపటి నుంచి అడిలైడ్‌లో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఆరంభమై ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ముగుస్తుంది. అయితే టెస్టుల్లో సంప్రదాయకంగా ఉపయోగించే ఎరుపు బంతిని ఈ తరహా మ్యాచ్‌ల్లో వాడరు. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు కృత్రిమ వెలుతురులోనూ బంతి స్పష్టంగా కనిపించేందుకు పింక్ బాల్ ను వాడడం ఆనవాయితీ. ప్రపంచ క్రికెట్ లో పింక్ బాల్ హిస్టరీపై ఓ లుక్కేద్దామా..! ( image credit : twitter)
భారత్ విషయానికి వస్తే.. చాలా ఆలస్యంగానే గులాబీ టెస్టుల్లోకి అడుగుపెట్టింది. అప్పట్లో డీఆర్ఎ్సతో పాటు డే/నైట్ టెస్టులపైనా అనాసక్తి చూపించింది. క్రితంసారి (2018-19) ఆసీస్ పర్యటనలో గులాబీ టెస్టు ఆడేందుకు కూడా భారత్ నిరాకరించింది. అయితే బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ రాకతో పరిస్థితులు మారాయి. గతేడాది తొలిసారిగా ఈడెన్‌లో కోహ్లీ సేన బంగ్లాదేశ్‌తో ఆడగా మ్యాచ్‌ను రెండు రోజుల్లోనే ముగించింది. ఓవరాల్‌గా ఇలాంటి మ్యాచ్ ఆడిన తొమ్మిదో జట్టుగా భారత్ నిలిచింది. ( image credit : twitter)
గులాబీ, ఎరుపు, తెలుపు బంతుల్లో ప్రధాన భాగమంతా ఒక్కటే. కానీ పింక్ బాల్‌పై ఉన్న లెదర్‌కు పింక్ పిగ్మెంట్‌తో కోటింగ్ చేస్తారు. మ్యాచ్ ఆరంభంలో ఇతర బంతులకన్నా ఎక్కువగా ఇవి స్వింగ్ అవుతుంటాయి. ప్రస్తుతం కూకాబుర్రా గులాబీ బంతులకు నల్లటి దారాలతో కుట్టు వేస్తున్నారు. గతంలో ఆకుపచ్చ, తెలుపుతో కూడిన సీమ్ ఉండేది. ( image credit : twitter)