‘తొలి రోజు ఆటలో ఎక్కువ భాగం రోహిత్ శర్మ అద్భుతంగా కెప్టెన్సీ చేశాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో చక్కటి ప్లేస్ మెంట్స్ సెట్ చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు నాలుగు వికెట్లను సాధించాడు. అయితే కొత్త బంతిని తీసుకునే విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశాడు. 81వ ఓవర్ తర్వాత కొత్త బంతిని తీసుకోకుండా ఉండాల్సింది’ అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
గ్రీన్, ఖవాజా పోరాటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరును అందుకుంది. 480 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. నాలుగు, ఐదు రోజుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభంగా ఉండదని కామెంటేటర్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో మూడో రోజు ఆటలో భారత్ ఎన్ని ఎక్కువ పరుగులు సాధిస్తే అంత మంచిది.