IND vs AUS : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. టీమిండియా స్టార్ ప్లేయర్ తండ్రి మృతి
IND vs AUS : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. టీమిండియా స్టార్ ప్లేయర్ తండ్రి మృతి
IND vs AUS : ఇక మూడో టెస్టు మార్చి 1 నుంచి 5 వరకు ఇండోర్ వేదికగా జరగనుంది. వాస్తవానికి మూడో టెస్టు ధర్మశాల వేదిక జరగాల్సి ఉంది. అయితే స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన పిచ్ ఇంకా సిద్ధం కాకపోవడంతో మ్యాచ్ ను ఇండోర్ కు తరలించారు.
ప్రస్తుతం భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తికాగా ఆ రెండింటిలోనూ టీమిండియానే విజేతగా నిలిచింది.
2/ 7
ఇక మూడో టెస్టు మార్చి 1 నుంచి 5 వరకు ఇండోర్ వేదికగా జరగనుంది. వాస్తవానికి మూడో టెస్టు ధర్మశాల వేదిక జరగాల్సి ఉంది. అయితే స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన పిచ్ ఇంకా సిద్ధం కాకపోవడంతో మ్యాచ్ ను ఇండోర్ కు తరలించారు.
3/ 7
ఇక ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) దీర్ఘకాలిక వ్యాధితో కన్నుమూశారు. (PC : ANI)
4/ 7
తిలక్ యాదవ్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో గత కొన్ని రోజులుగా అతడిని హాస్పిటల్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి విషమించడంతో వైద్యులు కూడా ఏం చేయలేకపోయారు. (PC : TWITTER)
5/ 7
ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా వైద్యులు కోరగా.. బుధవారం తిలక్ ను ఇంటికి తీసుకొచ్చారు. కాసేపటికే అతడు తుది శ్వాస విడిచినట్లు సమాచారం. తిలక్ యాదవ్ వాల్నీ కోల్ మైన్ లో ఉద్యోగిగా పనిచేశారు. (PC : TWITTER)
6/ 7
తండ్రి అంత్యక్రియల కోసం ఉమేశ్ యాదవ్ తన ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి జట్టుతో కలిసే అవకాశం ఉంది.
7/ 7
తొలి రెండు టెస్టుల్లోనూ ఉమేశ్ యాదవ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. మిగిలిన టెస్టుల్లో కూడా చోటు దక్కేది అనుమానమే. ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 54 టెస్టులు ఆడి 164 వికెట్లు తీశాడు.