Virat Kohli : ఛీ.. ఛీ.. కోహ్లీ, రాహుల్ లు మరీ ఇంత దారుణమా.. ఆ బౌలర్ కూడా దాటేశాడు
Virat Kohli : ఛీ.. ఛీ.. కోహ్లీ, రాహుల్ లు మరీ ఇంత దారుణమా.. ఆ బౌలర్ కూడా దాటేశాడు
Virat Kohli : అయితే కోహ్లీ ఎంట్రీతో మరో సచిన్ టీమిండియా తరఫున ఆడుతున్నాడనే ఫీలింగ్ వచ్చేసింది. 2014 ఇంగ్లండ్ సిరీస్ లో ఫెయిల్యూర్ తర్వాత క్రికెట్ ను సిరీయస్ గా తీసుకున్న కోహ్లీ పరుగుల వరద పారించాడు.
విరాట్ కోహ్లీ (Virat Kohli).. టీమిండియా (Team India) బ్యాటింగ్ వెన్నెముక. దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లు క్రికెట్ నుంచి తప్పుకున్నాక భారత బ్యాటింగ్ బలహీనం అవుతుందని అంతా భావించారు.
2/ 8
అయితే కోహ్లీ ఎంట్రీతో మరో సచిన్ టీమిండియా తరఫున ఆడుతున్నాడనే ఫీలింగ్ వచ్చేసింది. 2014 ఇంగ్లండ్ సిరీస్ లో ఫెయిల్యూర్ తర్వాత క్రికెట్ ను సిరీయస్ గా తీసుకున్న కోహ్లీ పరుగుల వరద పారించాడు.
3/ 8
దాదాపు నాలుగేళ్ల పాటు (2015 నుంచి 2019 వరకు) కోహ్లీ పీక్ ఫామ్ ను కొనసాగించాడు. బరిలోకి దిగితే సెంచరీ ఖాయం అన్నట్లు అతడి బ్యాటింగ్ సాగింది. అయితే 2019 అనంతరం కోహ్లీ నుంచి పరుగుల ప్రవాహం తగ్గిపోయింది.
4/ 8
అయితే గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి మళ్లీ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మళ్లీ సెంచరీ మోత మోగిస్తున్నాడు. అయితే ఇది కేవలం వన్డే, టి20లకు మాత్రమే పరిమితం అయ్యింది. టెస్టుల్లో కోహ్లీ మునుపటిలా భారీ ఇన్నింగ్స్ లను ఆడలేకపోతున్నాడు.
5/ 8
ఇక మరొక ప్లేయర్ కేఎల్ రాహుల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోహ్లీ వన్డే, టి20ల్లోనైనా రాణిస్తున్నాడు. కానీ, రాహుల్ మాత్రం మూడు ఫార్మాట్స్ లోనూ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక టెస్టుల్లో అయితే మరీ దారుణంగా ఆడుతున్నాడు.
6/ 8
ఏడాది కాలంగా వీరిద్దిరి టెస్టు గణాంకాలను తీసుకుంటే అసలు వీరు టాప్ బ్యాటర్సేనా అన్న అనుమానం కలుగుతుంది. కోహ్లీ గత ఏడాది కాలంగా టెస్టుల్లో కేవలం 21.2 సగటుతో పరుగులు చేస్తున్నాడు.
7/ 8
ఇక రాహుల్ విషయానికి వస్తే మరీ దారుణంగా ఉంది. కేవలం 13.6 సగటుతో ఏడాది కాలంగా టెస్టు జట్టులో పరుగులు చేస్తున్నాడు. ఇంత చెత్తగా ఆడుతూ అతడు జట్టులో ఎలా కొనసాగుతున్నాడో విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు.
8/ 8
ఇక కొసమెరుపు ఏంటంటే.. గత ఏడాది కాలంగా మొహమ్మద్ షమీ సగటు వీరిద్దరి సగటు కంటే ఎక్కువగా ఉండటం. షమీ టెస్టుల్లో గత ఏడాది కాలంగా 21.8 సగటుతో పరుగులు చేశాడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.