ENG vs NZ : క్రికెట్ చరిత్రలో ఇలాంటి గెలుపు నమోదవ్వడం నాలుగోసారి మాత్రమే.. కివీస్ కేక పెట్టించిందిగా
ENG vs NZ : క్రికెట్ చరిత్రలో ఇలాంటి గెలుపు నమోదవ్వడం నాలుగోసారి మాత్రమే.. కివీస్ కేక పెట్టించిందిగా
ENG vs NZ : టెస్టు మ్యాచ్ లో పరుగు తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1993లో ఆస్ట్రేలియాపై విండీస్ పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ కివీస్ పరుగు తేడాతో ఇంగ్లండ్ పై నెగ్గింది.
టెస్టు క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ (New Zealand) అద్భుత విజయాన్ని అందుకుంది. మంగళవారం ముగిసిన రెండో టెస్టులో పరుగు తేడాతో ఇంగ్లండ్ ను కివీస్ ఓడించింది. దాంతో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ డ్రాగా ముగిసింది. (PC : TWITTER)
2/ 9
టెస్టు మ్యాచ్ లో పరుగు తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1993లో ఆస్ట్రేలియాపై విండీస్ పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ కివీస్ పరుగు తేడాతో ఇంగ్లండ్ పై నెగ్గింది. (PC : TWITTER)
3/ 9
ఇక ఈ మ్యాచ్ లో మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే.. ఫాలో ఆన్ ఆడి గెలవడం. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫాలో ఆన్ ఆడి మరీ గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. (PC : TWITTER)
4/ 9
టెస్టుల్లో ఫాలో ఆన్ ఆడి గెలవడం ఇది నాలుగోసారి మాత్రమే. 1894లో ఇంగ్లండ్ జట్టు ఫాలో ఆన్ ఆడి ఆస్ట్రేలియాపై గెలిచింది. ఇక 1981లో మరోసారి ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఆడి గెలిచింది. అప్పుడు కూడా ప్రత్యర్థి ఆస్ట్రేలియా కావడం విశేషం. (PC : TWITTER)
5/ 9
ఇక 2001లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ల వీరోచిత పోరాటం ప్రతి భారత అభిమానికి గుర్తుండే ఉంటుంది. (PC : TWITTER)
6/ 9
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. అయితే భారత్ 171 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా భారత్ ను ఫాలో ఆన్ ఆడించాడు. (PC : TWITTER)
7/ 9
ఈ క్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ డబుల్ సెంచరీ (281), ద్రవిడ్ సెంచరీ (180)లతో చెలరేగారు. ఫలితంగా భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 7 వికెట్లకు 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. (PC : TWITTER)
8/ 9
అనంతరం ఆస్ట్రేలియా 212 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తో మెరిశాడు. ఆఖర్లో సచిన్ టెండూల్కర్ కూడా వికెట్లు తీసి భారత విజయంలో తన వంతు పాత్ర పోషిస్తాడు. (PC : TWITTER)
9/ 9
ఇక తాజాగా కివీస్ కూడా ఇంగ్లండ్ పై ఫాలో ఆన్ నెగ్గింది. రెండో ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 258 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 256 పరుగులకు కుప్పకూలింది. (PC : TWITTER)