IND vs AUS : డేంజరస్ ప్లేయర్స్ ఇన్.. మూడో టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోన్న స్మిత్
IND vs AUS : డేంజరస్ ప్లేయర్స్ ఇన్.. మూడో టెస్టు కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోన్న స్మిత్
IND vs AUS : ఇక మూడో టెస్టు నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో రెండో టెస్టు అనంతరం కమిన్స్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)కోసం భారత్ (India)లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా (Australia)కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. గాయాల బెడదతో పాటు తొలి రెండు టెస్టుల్లో ఎదురైన ఘోర ఓటములు టీంను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
2/ 8
ఇక మూడో టెస్టు నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. తల్లి అనారోగ్యంతో ఉండటంతో రెండో టెస్టు అనంతరం కమిన్స్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు.
3/ 8
మొదట కమిన్స్ మూడో టెస్టు నాటికి భారత్ కు తిరిగి చేరుకుంటాడని పేర్కొన్నారు. అయితే తల్లి ఆరోగ్యం ఇంకా మెరుగవ్వకపోడంతో మరికొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉండాలని కమిన్స్ నిర్ణయించుకున్నాడు.
4/ 8
ఈ నేపథ్యంలో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా కోసం ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడ్డాడు. కమిన్స్ లేకపోవడంతో మిచెల్ స్టార్క్ ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం.
5/ 8
రెండో టెస్టులో కంకషన్ అయిన వార్నర్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో రెండో టెస్టు ఆడిన రెన్ షాను ఆసీస్ కు పంపేశారు. దాంతో మూడో టెస్టులో కెమరూన్ గ్రీన్ బరిలోకి దిగనున్నాడు.
6/ 8
మూడో టెస్టులో ఈ రెండు మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా, అక్షర్ పటేల్ ల కోసం స్మిత్ వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
7/ 8
ముఖ్యంగా కెప్టెన్సీని స్మిత్ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. గ్రీన్ అవసరం అయితే మీడియం పేస్ వేస్తాడు. దాంతో అతడు రెండో పేసర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక రెండో టెస్టులో ఆడిన ముగ్గురు స్పిన్నర్లు కొనసాగే అవకాశం ఉంది.
8/ 8
మార్చి 1 నుంచి జరిగే మూడో టెస్టు కోసం ఇరు జట్లు కూడా ఇండోర్ కు చేరుకున్నాయి. రెండో టెస్టు అనంతరం బీసీసీఐ భారత ప్లేయర్లకు 6 రోజుల పాటు సెలవులను ప్రకటించింది.