ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో తుస్సుమన్న టీమిండియా పోటుగాడు.. ఇంకెంత కాలం భరించాలి
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో తుస్సుమన్న టీమిండియా పోటుగాడు.. ఇంకెంత కాలం భరించాలి
ICC Rankings : ఇక ఇప్పటికే భారత్.. టి20, వన్డేల్లో నంబర్ 1 జట్టుగా ఉంది. దాంతో ఏక కాలంలో మూడు ఫార్మట్లలోనూ టీమిండియా టాపర్ గా ఉండటం విశేషం. ఇక ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు జోరు కనబరిచారు.
ఐసీసీ (ICC) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా (Team India) అగ్రస్థానానికి చేరుకుంది. 115 రేటింగ్ పాయింట్లతో నిన్నటి వరకు నంబర్ 1గా ఉన్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్ ను చేరుకుంది.
2/ 7
ఇక ఇప్పటికే భారత్.. టి20, వన్డేల్లో నంబర్ 1 జట్టుగా ఉంది. దాంతో ఏక కాలంలో మూడు ఫార్మట్లలోనూ టీమిండియా టాపర్ గా ఉండటం విశేషం. ఇక ర్యాంకింగ్స్ లో భారత ప్లేయర్లు జోరు కనబరిచారు.
3/ 7
వన్డే, టి20, టెస్టు ఇలా మూడు ఫార్మాట్లలోనూ భారత్ ప్లేయర్లు సత్తా చాటారు. అయితే ఒక ప్లేయర్ మాత్రమ ర్యాంకింగ్స్ లో తుస్సుమనించాడు. అతడెవరో కాదు కేఎల్ రాహుల్.
4/ 7
కేఎల్ రాహుల్ కంటే వెనుకగా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, శుబ్ మన్ గిల్ లు బ్యాటింగ్ లో అదరగొట్టి ర్యాంకింగ్స్ లో మెరుస్తుంటే రాహుల్ మాత్రం రోజు రోజుకి దిగజారుతున్నాడు.
5/ 7
ఒక్క ఫార్మాట్లో కూడా టాప్ 25లో చోటు దక్కించుకోలేకపోయాడు. టెస్టుల్లో 52.. వన్డేల్లో 41.. టి20ల్లో 27 ర్యాంకుల్లో నిలిచాడు. ఏడాది కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న మయాంక్ అగర్వాల్ టెస్టు ర్యాంక్ (27) రాహుల్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం.
6/ 7
టీమిండియా నుంచి వేటుకు గురైన ధావన్ వన్డే ర్యాంక్ 31 అయితే.. రాహుల్ ది 41. అయితే టి20ల్లో మాత్రం రాహుల్ 27వ స్థానంలో నిలవడం విశేషం. కేఎల్ రాహుల్ ఎంతటి పేలవ ఫామ్ లో ఉన్నాడో అతడి ర్యాంకింగ్సే చెబుతున్నాయి.
7/ 7
అయినా కూడా టీమిండియాలో వరుసగా అవకాశాలు దక్కించకుంటున్నాడు. ఇక టెస్టుల్లో వైస్ కెప్టెన్ కూడా. పేలవ ఫామ్ లో ఉన్నా అతడికి అవకాశాలు కల్పిస్తుండటానికి బీసీసీఐ దగ్గర ఉన్న కారణం ఏంటో ఆ దేవుడికే తెలియాలి.