IND vs AUS 2nd Test : జిడ్డు ప్లేయర్ ముద్దు.. నెం.1 ప్లేయర్ వద్దు.. ఇదేం కర్మరా బాబు
IND vs AUS 2nd Test : జిడ్డు ప్లేయర్ ముద్దు.. నెం.1 ప్లేయర్ వద్దు.. ఇదేం కర్మరా బాబు
IND vs AUS 2nd Test : తొలి టెస్టులో టీమిండియా తరఫున ముగ్గురు ప్లేయర్లు మాత్రమే అదిరిపోయే ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ సెంచరీతో మెరిస్తే.. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో కనబరిచాడు. ఇక అశ్విన్ కీలకమైన వికెట్లను తీశాడు.
తొలి టెస్టులో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (Border Gavaslar Trophy) 2023లో టీమిండియా (Team India) శుభారంభం చేసింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టును కేవలం 3 రోజుల్లోపే ముగించేసి ఘనవిజయం సాధించింది.
2/ 9
తొలి టెస్టులో టీమిండియా తరఫున ముగ్గురు ప్లేయర్లు మాత్రమే అదిరిపోయే ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ సెంచరీతో మెరిస్తే.. రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో కనబరిచాడు. ఇక అశ్విన్ కీలకమైన వికెట్లను తీశాడు.
3/ 9
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారాలు నిరాశ పరిచారు. కోహ్లీ, పుజారాలను పక్కనబెడితే.. గత కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ పై అభిమానులు మండిపడుతున్నారు.
4/ 9
వరుసగా విఫలం అవుతున్నా.. అతడికి అవకాశాల మీద అవకాశాలను ఇస్తునే ఉన్నారు. అంతేకాకుండా వైస్ కెప్టెన్ ను చేయడం భారత అభిమానుల పుండు మీద కారం చల్లినట్లు అనిపిస్తోంది.
5/ 9
ఇక ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం టీంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ ను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.
6/ 9
తొలి టెస్టులో గిల్ ను పక్కనపెట్టడంపై టీమిండియా మేనేజ్ మెంట్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దాంతో రెండో టెస్టులో గిల్ ను ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడించే అవకాశం ఉంది.
7/ 9
అయితే పేలవ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ స్థానంలో కాకుండా తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందట.
8/ 9
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక టెస్టు మ్యాచ్. అందులోనూ ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా టి20ల్లో నంబర్ వన్ ర్యాంకర్. దూకుడుగా ఆడే శైలి ఉన్న ప్లేయర్.
9/ 9
అయితే తన బ్యాటింగ్ తో సహనానికే సహనం పెట్టే రాహుల్ కు మరో అవకాశం ఇచ్చి.. సూర్యకుమార్ యాదవ్ ను పక్కనపెట్టాలనే నిర్ణయానికి టీమిండియా మేనేజ్ మెంట్ వచ్చినట్లు తెలుస్తుంది.