బోర్డర్- గవాస్కర్ 2023 ట్రోఫీ (Border Gavaskar Trophy)లో ఇండియా (India) బలమైన ముందడుగు వేసింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి 1-0 ఆధిక్యం సాధించింది. నాగ్‌పూర్‌లో జరిగిన ఓపెనింగ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండు ఇన్నింగ్స్‌లలో ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే ఇండియా ఆలౌట్ చేసింది.
జడేజా, అశ్విన్ స్పిన్‌కు ఆసీస్ ప్లేయర్లు బ్యాట్లు ఎత్తేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ ఇండియాకు మెరుగైన ఆధిక్యాన్ని అందించింది. జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలకంగా మారింది. ఇప్పుడు రెండో టెస్ట్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు రాజధానికి తరలివెళ్లింది. సెకండ్ టెస్ట్‌కి సంబంధించిన విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇదే జరిగితే ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అతను ఆడే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్లేస్‌లో శ్రేయాస్ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీ20ల్లో టీమిండియా నెం.1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ పై ఈ మ్యాచులో వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ టెస్టులో జట్టులో చోటు దక్కించుకున్న సూర్య.. అంతగా రాణించలేదు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు ఇండియన్ టెస్ట్ స్క్వాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కెఎస్ భరత్ (వికెట్ కీపర్, బ్యాటర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, బ్యాటర్), ఆర్.అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్.