IND vs AUS : ఇక చాలు! ఆ టీమిండియా పోటుగాడిని సాగనంపండి.. లేదంటే గుడ్లు విసిరించుకోవాలి
IND vs AUS : ఇక చాలు! ఆ టీమిండియా పోటుగాడిని సాగనంపండి.. లేదంటే గుడ్లు విసిరించుకోవాలి
IND vs AUS : తమకు నచ్చిన ప్లేయర్లు ఫామ్ లో లేకపోయినా వరుస పెట్టి అవకాశాలు ఇస్తుందనే చెడ్డ అపవాదు కూడా ఉంది. అదే సమయంలో కొందరు ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వడంలో జాప్యం కూడా చేస్తుంది.
టీమిండియా (Team India)లో ప్రస్తుతం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ట్యాలెంట్ ఉన్న ప్లేయర్స్ జట్టులో స్థానం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ప్లేయర్ల విషయంలో టీమిండియా మేనేజ్ మెంట్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి.
2/ 8
తమకు నచ్చిన ప్లేయర్లు ఫామ్ లో లేకపోయినా వరుస పెట్టి అవకాశాలు ఇస్తుందనే చెడ్డ అపవాదు కూడా ఉంది. అదే సమయంలో కొందరు ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వడంలో జాప్యం కూడా చేస్తుంది.
3/ 8
సంజూ సామ్సన్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్లు టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. సంజూ సామ్సన్ పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకుంటున్నా ప్లేయింగ్ ఎలెవెన్ లో మాత్రం అవకాశాలు రావడం లేదు.
4/ 8
ఇక అదే సమయంలో దేశవాళి టోర్నీలో సెంచరీలతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేఎల్ రాహుల్ విషయంలో మాత్రం టీమిండియా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది.
5/ 8
గత కొంతకాలంగా పేలవ ఫామ్ లో ఉన్నా రాహుల్ కు వరుస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు. శుబ్ మన్ గిల్ రూపంలో భారత్ కు ఓపెనింగ్ ఆప్షన్ ఉన్నా.. కేఎల్ రాహుల్ వైపు టీమిండియా ఎందుకు మొగ్గు చూపుతుందో అర్థం కావడం లేదు.
6/ 8
కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు 46 మ్యాచ్ లు ఆడాడు. 79 ఇన్నింగ్స్ ల్లో 2,646 పరుగులు చేశాడు. సగటు 34.07. టెస్టు కెరీర్ లో సగటు 40 కంటే తక్కువ ఉంటే అతడికి ఛాన్స్ లు ఇవ్వడమే దండగ అనే అభిప్రాయం ఉంది.
7/ 8
జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ సగటు 41పైనే. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 20 పరుగులు చేసిన అతడు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేశాడు.
8/ 8
కేఎల్ రాహుల్ కంటే కూడా లోయరార్డర్ లో వచ్చే అక్షర్ పటేల్, అశ్విన్ లు జట్టుకు ఉపయోగపడేలా బ్యాటింగ్ చేస్తున్నారు. రాహుల్ జట్టులో ఉంటే ఒక వికెట్ సులభంగా వస్తుందనే భావన ప్రత్యర్థి జట్లకు వచ్చేసింది.