IND vs AUS : రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్న స్టార్ బ్యాటర్
IND vs AUS : రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్న స్టార్ బ్యాటర్
IND vs AUS 2nd Test :అయితే రెండో టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ స్టార్ బ్యాటర్ రెండో టెస్టు మిగిలిన ఆటకు దూరమయ్యాడు.
ఢిల్లీ (Delhi) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
2/ 7
అయితే రెండో టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ స్టార్ బ్యాటర్ రెండో టెస్టు మిగిలిన ఆటకు దూరమయ్యాడు.
3/ 7
తొలి రోజు ఆటలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ హెల్మెంట్ కు బంతి బలంగా తాకిన సంగతి తెలిసిందే. మొహమ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ వార్నర్ హెల్మెంట్ కు బలంగా తాకింది. అప్పుడు అతడిని ఫిజియోలు పరిశీలించి ఆటను కొనసాగించేందుకు అనుమతి తెలిపారు.
4/ 7
అయితే 15 పరుగులు చేసిన వార్నర్.. షమీ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుటైన సంగతి తెలిసిందే. ఇక మూడో సెషన్ ఆఖర్లో భారత్ బ్యాటింగ్ కు రాగా వార్నర్ ఫీల్డింగ్ చేయలేదు.
5/ 7
ఇక శనివారం ఉదయం వార్నర్ రెండో టెస్టు మిగిలిన ఆటకు దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటన ద్వారా తెలిపింది. కంకషన్ సబ్ స్టిట్యూట్ కింద అతడి స్థానంలో రెన్ షా తుది జట్టులో ఆడనున్నాడు.
6/ 7
ఆస్ట్రేలియా ప్లేయర్ ఫిలిప్ హ్యూజ్ మరణం అనంతరం ఐసీసీ కంకషన్ సబ్ స్టిట్యూట్ నిబంధనను తీసుకొచ్చింది. మ్యాచ్ ఆడుతూ ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉన్న ప్లేయర్ తలకు గాయమైతే.. అతడి స్థానంలో వేరే వాళ్లను కంకషన్ సబ్ స్టిట్యూట్ కింద తీసుకోవచ్చు.
7/ 7
ఆటలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ కు కేవలం ఫీల్డింగ్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. అయితే కంకషన్ సబ్ స్టిట్యూట్ కు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయి.