IND vs AUS : పోరాటం అంటే ఇదీ.. వారిద్దరే లేకుంటే టీమిండియా గతి అధోగతి
IND vs AUS : పోరాటం అంటే ఇదీ.. వారిద్దరే లేకుంటే టీమిండియా గతి అధోగతి
IND vs AUS : ముఖ్యంగా రెండో రోజు తొలి రెండు సెషన్లలోనూ ఆసీస్ దే పైచేయి. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 21/0తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ఢిల్లీ (Delhi) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గట్టి పోటీ ఇస్తుంది. తొలి టెస్టులో కనీసం పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేసిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో మాత్రం భారత్ కు టఫ్ ఫైట్ ఇచ్చింది.
2/ 8
ముఖ్యంగా రెండో రోజు తొలి రెండు సెషన్లలోనూ ఆసీస్ దే పైచేయి. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగడంతో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 21/0తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. (PC : TWITTER)
3/ 8
ముఖ్యంగా కేఎల్ రహుల్ (17), 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0), ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ (4) నిరాశ పరిచారు. అయితే రోహిత్ శర్మ (32), కోహ్లీ (44), రవీంద్ర జడేజా (26) ఫర్వాలేదనిపించారు. (PC : BCCI)
4/ 8
అయితే లంచ్ అనంతరం భారత్ వరుసగా వికెట్లను కోల్పోయింది. కోహ్లీతో పాటు భరత్, జడేజాలు వెంట వెంటనే అవుటయ్యారు. దాంతో భారత్ 139 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. (PC : BCCI)
5/ 8
అక్షర్ పటేల్ (74), రవిచంద్రన్ అశ్విన్ (37) లు క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 124 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఇక్కడి నుంచి అక్షర్ పటల్, అశ్విన్ లు వీరోచిత పోరాటం చేశారు. (PC : BCCI)
6/ 8
మొదట నెమ్మదిగా ఆడిన వీరు ఆ తర్వాత వేగంగా ఆడారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ లు ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.
7/ 8
వీరిద్దరూ 8వ వికెట్ కు 114 పరుగులు జోడించారు. అనంతరం అశ్విన్ 37 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఒక దశలో ఆసీస్ కు 100 పరుగుల ఆధిక్యం లభిస్తుందని అంతా అనుకున్నారు. చివరకు భారత్ 262 పరుగులకు ఆలౌటైంది.
8/ 8
అయితే అక్షర్ పటేల్, అశ్విన్ ల వీరోచిత పోరాటం ఆస్ట్రేలియా ఆధిక్యంపై నీళ్లు చల్లింది. రాహుల్, పుజారా, శ్రేయస్ అయ్యర్ లు అక్షర్ పటేల్, అశ్విన్ ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.