IND vs AUS : టీమిండియా కొదమ సింహాలు.. ప్రత్యర్థి ఎవరైనా ఈ ముగ్గురికి ఎరగా మారాల్సిందే
IND vs AUS : టీమిండియా కొదమ సింహాలు.. ప్రత్యర్థి ఎవరైనా ఈ ముగ్గురికి ఎరగా మారాల్సిందే
IND vs AUS 2nd Test :ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో టీమిండియా తొలి రెండు టెస్టుల్లోనూ విజయాలను సాధించింది. తొలి టెస్టులో అలవోకగా నెగ్గిన భారత్ రెండో టెస్టులో మాత్రమ కాస్త శ్రమించాల్సి వచ్చింది.
టీమిండియా (Team India) సూపర్ ఫామ్ లో ఉంది. అన్ని విభాగాల్లోనూ చక్కగా రాణిస్తోంది. ఈ క్రమంలో వరుస పెట్టి సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీలంక (Sri Lanka), న్యూజిలాండ్ (New Zealand) జట్లను మట్టికరిపించిన భారత్.. ఇప్పుడు ఆస్ట్రేలియా (Australia) పని పడుతుంది.
2/ 9
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో టీమిండియా తొలి రెండు టెస్టుల్లోనూ విజయాలను సాధించింది. తొలి టెస్టులో అలవోకగా నెగ్గిన భారత్ రెండో టెస్టులో మాత్రమ కాస్త శ్రమించాల్సి వచ్చింది.
3/ 9
రెండో టెస్టులో భారత టాపార్డర్ పెద్దగా రాణించకపోయినా.. లోయర్ ఆర్డర్ తో పాటు బౌలర్లు అద్బుత ప్రదర్శన చేశారు. రెండో టెస్టులో టీమిండియా గెలవడంలో ముగ్గురు ప్లేయర్లు ప్రధాన పాత్ర పోషించారు.
4/ 9
ప్రస్తుతం వీరిని టీమిండియా కొదమ సింహాలుగా అభిమానులు అభివర్ణిస్తున్నారు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ల రూపంలో టీమిండియాలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
5/ 9
తొలి టెస్టులోనూ ఈ ముగ్గురు ప్లేయర్లు అద్బుత ప్రదర్శన చేశారు. ఇక రెండో టెస్టులో అయితే వీరి వల్లే భారత్ గెలిచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రెండో రోజు ఆటలో అక్షర్ పటేల్, అశ్విన్ ల 114 పరుగుల భాగస్వామ్యాం జట్టును గెలిపించిందనే చెప్పాలి.
6/ 9
ఇక బౌలింగ్ లో జడేజా, అశ్విన్ లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. తొలి టెస్టులో 7 వికెట్లు తీసిన జడేజా.. రెండో టెస్టులో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ లో తొలి టెస్టులో 70 పరుగులు చేసి.. రెండో టెస్టులో 26 పరుగులు చేశాడు.
7/ 9
ఇక అశ్విన్ విషయానికి వస్తే తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన అతడు.. రెండో టెస్టులో 6 వికెట్లు తీశాడు. అంతేకాకుండా తొలి టెస్టులో 23 పరుగులు.. రెండో టెస్టులో 37 పరుగులు చేశాడు.
8/ 9
అక్షర్ పటేల్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో ఇప్పటి వరకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. అయితే రెండు టెస్టుల్లోనూ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. తొలి టెస్టులో 84 పరుగులు చేస్తే.. రెండో టెస్టులో 74 పరుగులు చేశాడు. లోయరార్డర్ లో భారత్ కు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి మ్యాచ్ లను గెలిచేలా చేశాడు.
9/ 9
ఈ ముగ్గురు కూడా సూపర్ ఫామ్ లో ఉండటంతో ఆస్ట్రేలియా వ్యూహాలు పనిచేయడం లేదు. రాహుల్, విరాట్, పుజారాలు పెద్దగా ఆడకపోయినా ఈ ముగ్గురి ఆల్ రౌండ్ షోతో టీమిండియా సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.